Newspaper Banner
Date of Publish : 13 July 2026, 11:04 am Digital Edition : VAARTHA VEKUVA DAILY

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిరుపేదలకు ఆహార పంపిణీ

హైదరాబాద్/సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూలై 13 :జనగామ

నియోజకవర్గ ఎమ్మెల్యేపల్ల రాజేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్–సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో సేవా కార్యక్రమం నిర్వహించారు. చేర్యాల మండల బీఆర్ఎస్ యువ నాయకుడు కడారి నవీన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు చికెన్ బిర్యానీతో పాటు ఒక్కో కుటుంబానికి ఒక కిలో బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేశారు.

 

ఈ సందర్భంగా కడారి నవీన్ మాట్లాడుతూ, తమ అభిమాన నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం ఆనందంగా ఉంటుందని తెలిపారు. ప్రజల పట్ల ఎమ్మెల్యే చూపుతున్న సేవా దృక్పథం తమకు స్ఫూర్తినిస్తోందని, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని నిరుపేదలకు ఆహార పంపిణీ నిర్వహించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.

 

“మా అభిమాన నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదినం అంటే మాకెంతో ప్రత్యేకం. ఆయనపై ఉన్న అభిమానంతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఆయన కోసం ఎలాంటి సేవ చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాం” అని కడారి నవీన్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఆహార పొట్లాలు, బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి దీర్ఘాయుష్షుతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.